పేజీలు

8, ఆగస్టు 2016, సోమవారం

మ్యారేజ్ సర్టిఫికెట్ పొందడం ఎంత సింపులో తెలుసా ?

  • పెళ్లికి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి..! 

మీరు వివాహం చేసుకోబోతున్నారా..? లేదా మీకు తెలిసిన వారు వివాహం చేసుకోబోతున్నారా..? అయితే జరగబోయే వివాహానికి చట్టబద్ధత కల్పించుకోమని వారికి మీ మాటగా చెప్పండి.. గతంలో పెళ్లి పత్రికలు, ఫోటోలు వివాహానికి ఆధారంగా ఉండేవి. అయితే వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చింది. వివాహాల అధికారి ధృవీకరిస్తూ ఇచ్చే వివాహ నమోదు పత్రం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడనుంది.
 
ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వివాహాల నమోదు చట్టం-2002 రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు, తెగలకు వర్తిస్తుంది. ఈ చట్టంలోని 8వ సెక్షన్‌ రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం తప్పనిసరిగా నమోదు కావాలని స్పష్టం చేస్తోంది. ఈచట్టాన్ని 2002, మే 21న రాష్ట్ర గవర్నర్‌ ఆమోదించగా, 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమలుకు రాష్ట్ర స్థాయిలో వివాహాల రిజిస్ట్రార్ జనరల్‌ ఉంటారు. అన్ని జిల్లాలకు వివాహాల రిజిస్ట్రార్‌లు ఉంటారు. నిర్ణయించిన సంఖ్యలో అదనపు డిప్యూటీ రిజిసా్ట్రర్లు జిల్లాల్లో ఉంటారు. వివాహాల రిజిస్ట్రార్‌ జనరల్‌ జారీచేసే నిబంధనలకు లోబడి, జిల్లాలో అమలు చేసే బాధ్యత సంబంధిత జిల్లాల రిజిస్ట్రార్లపైనే ఉంటుంది. వివాహాల రిజిస్ట్రేషన్‌ కోసం ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఉంటుంది. దాని పరిధిలో ప్రాంతాలవారీగా వివాహాల అధికారులు ఉంటారు. గ్రామాల్లో గ్రామకార్యదర్శి, మునిసిపాలిటీల్లో, కార్పొరేషన్లలో సంబంధిత మునిసిపల్‌ కమిషనర్లు వివాహాల అధికారులుగా వ్యవహరిస్తారు. వారు తమ ప్రాంతంలోని వివాహాల రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో నిర్దేశించిన వేళల్లో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఆ కార్యాలయ పని రోజులు, వేళలు నోటీసు బోర్డుపై అందరికీ కనిపించేలా పెట్టాలి.
 
ఎలా నమోదు చేసుకోవాలంటే..?!
  • వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు పెళ్లి కుమారుడు, కుమార్తె లేదా ఇద్దరిలో ఎవరి తల్లిదండ్రులు, సంరక్షకులైనా వివాహం నమోదు కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫారం నింపి అధికారికి అందజేయాలి.
  • దరఖాస్తులో పెళ్లి కుమారుడు, కుమార్తె వయస్సు తెలియజేయాలి.
  • పెళ్లి కుమారుడు, కుమార్తె తరపున ఇద్దరిద్దరు సాక్షులు వివాహాల అధికారి సమక్షంలో సంతకం చేయాల్సి ఉంటుంది.
  • వివాహాల అధికారి ఈ సమాచారాన్ని వివాహాల రిజిష్టర్‌లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకుంటారు.
  • పెళ్లి జరిగే చోట, లేదా మన ఇంటి వద్ద కూడా వివాహం నమోదు చేసుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుని ఆ ప్రాంతం వివాహాల అధికారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • వివాహ నమోదు పత్రం (సర్టిఫికెట్‌)పై వివాహాల అధికారి సంతకం, సీలు వేసి దంపతులకు ఉచితంగా అందజేస్తారు.
  • వివాహాల నమోదు రిజిష్టర్‌లో నమోదైన వివాహాల సమాచారం తెలుసుకోవాలంటే నిర్ణీత ఫీజు చెల్లించి పొందవచ్చు.
  • వివాహం జరిగిన 30 రోజుల తరువాత ఆ వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించాలంటే జరిగిన నాటి నుంచి రెండు నెలలలోపు రూ.100 ఫీజుతో నమోదు చేసుకునే అవకాశం ఉంది.
వివాహం ఎందుకు నమోదు చేసుకోవాలి..?
  • ఈవిధంగా నమోదు చేసుకుంటే చట్టబద్ధత ఉంటుంది.
  • కుటుంబానికి సంబంధించిన అన్నిపథకాలు వర్తించేందుకు ఇదెంతో దోహదపడుతుంది.
  • భర్త నుంచి విడిపోయినా, దూరంగా ఉన్నా భరణం కోరేందుకు ఆధారంగా ఉపయోగపడుతుంది.
  • కట్నం వేధింపుల సందర్భంగా నేరం రుజువు కావడానికి ముఖ్య ఆధారంగా పనికి వస్తుంది.
  • హింస, వేదనకు గురైన లేదా గురవుతున్న మహిళలు విడాకులు పొందడానికి అవసరం. విడాకులు కోరే భర్త కూడా వివాహం జరిగిన ఆధారం చూపాల్సి ఉంటుంది.
  • రెండవ వివాహాలను అడ్డుకోవడానికి మహిళలు, పురుషులిద్దరికీ ఇదొక ముఖ్యమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుంది.
  • ప్రేమ పేరుతో మోసాలు, రహస్య వివాహాలు, సాక్ష్యాలు, రుజువు లేని వివాహాలను నిలిపి వేయడానికి ఇదొక ఆధారంగా పనికి వస్తుంది.
  • బాల్య వివాహాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
  • వివాహ నమోదు చట్టం ఆధారంగా మహిళలు ఇతర సంబంధిత చట్టాల నుంచి త్వరగా తీర్పు పొందే అవకాశం ఉంటుంది.
తప్పుడు సమాచారం ఇస్తే...?
  • ఉద్దేశపూర్వకరంగా, లేదా తెలిసినా నిర్లక్ష్యంతో వివాహం నమోదు చేసు కోని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు.
  • వివాహ నమోదు పత్రంలో తెలిసి/ మోసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే ఏడాది జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా, లేదా ఈ రెండూ అమలు చేస్తారు.
  • వివాహం నమోదు చేయని వివాహాల అధికారికి మూడు నెలల జైలుశిక్ష, లేదా రూ.500 జరిమానా, లేదా ఈ రెండు శిక్షలు అమలు చేస్తారు.

1 కామెంట్‌:

  1. HINDU MARRIAGE REGISTRATION REQUIREMENTS AND PRECAUTIONs

    Bride minimum age at the solemnisation of marriage – 18 years completed.

    Bridegroom minimum age at the solemnisation of marriage - 21 years completed.

    Form A in duplicate along with payment of prescribed fee.

    Wedding invitation card.

    A photograph of marriage ceremony capturing both wife and husband.

    Residential proof of either of the spouse.

    Copies of SSC Certificates of wife and husband or passport copies (for Date of Birth proof).

    Three witnesses to sign in the form.

    Three witnesses to sign in the register of Registrar office.

    Check thrice the details filled in the Form A. Names of the bride and groom shall always be tallied with the names given in the passport/SSC and other certificates. Otherwise, at the time of issuance of visa and other certificates, you may have to face problem.

    It is advisable to mention the name of the wife (bride) before and after marriage at Sl.No. 1 of the Form A. Before marriage, the surname usually belongs to father’s family. And after marriage, the surname of the husband’s family is adopted. So it is advisable, to mention two names as

    name (before marriage), and name (after marriage).

    Eg. Wife (bride) name before marriage – Akaram Kumari;

    రిప్లయితొలగించండి