ఈరోజు Facebookలో Friendగా సజెషన్ వచ్చిన ఓ ప్రొఫైల్ ఇమేజ్ ని చూడగానే
అది నకిలీ ప్రొఫైల్ అని సందేహం వచ్చింది. నకిలీ ప్రొఫైళ్ల గురించీ, ఫేస్
బుక్ యూజర్లు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి "కంప్యూటర్ ఎరా" మేగజైన్ లోనూ,
etv2, inews, ntv, zee24hours, abn వంటి వివిధ ఛానెళ్లలోనూ పలు
సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నాను. అసలు నకిలీ ప్రొఫైల్ ఎలా
తయారవుతోందో మిత్రులకు ఓ అవగాహన కల్పించడం కోసం నా దృష్టికి వచ్చిన నకిలీ
ప్రొఫైల్ తయారైన విధానాన్ని ఈ క్రింద ఫొటోల్లో చూపించిన విధంగా
స్టెప్-బై-స్టెప్ కనుక్కున్నాను. ఫొటోలన్నీ చూస్తే మీకు ఈజీగా
అర్థమవుతుంది.
ఇంటర్నెట్ లో వేల సంఖ్యలో అశ్లీల సైట్లు
ఉన్నాయి. వాటిలో ఎవరికీ సందేహం రాని విధంగా కొద్దిగా అశ్లీలంగా ఉండే ఇమేజ్
లను నకిలీ ప్రొఫైళ్లుగా క్రియేట్ చేసుకుంటున్నారు. అది నకిలీదని తెలియక
చాలామంది అవతల నిజమైన మహిళ ఉందని భావించి.. పిచ్చి పిచ్చి కామెంట్లు
రాస్తున్నారు. వేలంవెర్రిగా ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వారికి పంపిస్తున్నారు.
దీంతో దొంగ చేతిలో మన ప్రైవసీని పెడుతున్నట్లు అవుతుంది. ఈ మెసేజ్ ని,
నేను కష్టపడి మీ అందరి అవగాహన కోసం తయారు చేసిన ఈ ఫొటోలను మీ మిత్రులకూ
షేర్ చేయడం ద్వారా వారూ మోసపోకుండా జాగ్రత్తపడండి.
ఇక్కడ ఆ ఫొటో ఒరిజినల్ వ్యక్తిదే అనుకుంటే.. ఆ మహిళ ఎలాంటి ఫొటోలు అప్ లోడ్ చేయాలి, ఎలాంటివి కూడదు అన్న దానిపై ఆలోచించాలి. ఫేస్ బుక్ యూజర్లు ఎవరైనా తాము ఆల్బమ్ లలో పెట్టే ఫొటోలు సంస్కారవంతంగా ఉండేవిగా జాగ్రత్త తీసుకోపోతే ఇలాగే అశ్లీల సైట్లలో పరువు పోగొట్టుకోవలసిన పరిస్థితి తలెత్తుతుంది. అది మామూలు మహిళలైనా, సెలబ్రిటీలైనా, కాదు మాకు ఎలాగోలా పబ్లిసిటీ వస్తే చాలు badగానైనా అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. its upto you . Final Note: ఇక్కడ నూటికి నూరు శాతం నేను ఎగ్జాంపుల్ చూపించిన ప్రొఫైల్ నకిలీది అని నిర్థారించడానికి బలమైన ఆధారం ఏమిటంటే, ఆ వ్యక్తి మరో వ్యక్తితో దిగిన ఒరిజినల్ ఫొటో అశ్లీల సైట్ లో ఉంది. ఆ మనిషిది ఒరిజినల్ ప్రొఫైల్ అనుకుంటే ఆ ఒరిజినల్ ఫొటో ఆ మహిళ ఆల్బమ్ లో ఉండి తీరాలి. కానీ ఫుల్ ఫొటో ఆ ఆల్బమ్ లో లేదు. Crop చేయబడిన ఇమేజ్ మాత్రమే ఉంది. అంటే అది అశ్లీల సైట్ నుండి వాడబడింది అన్నమాట.
ఇంతకీ మరింత పరిశోధించి
ముందుకు వెళితే అర్థమైనదేమిటంటే.. ఆన్ లైన్ సర్వేలూ, ఏడ్ క్లిక్ లు, ఇంటి
దగ్గర కూర్చునే వేలాది రూపాయలు సంపాదించండి వంటి మోసపూరితమైన స్కీమ్ లతో ఆ
నకిలీ ప్రొఫైల్ ఓ వెబ్ సైట్ ని నిర్వహిస్తోంది. ఆ వెబ్ సైట్ కి
సందర్శకులను ఆకర్షించి వ్యాపారం చేసుకోవడం
ఆ ప్రొఫైల్ ఓనర్ ఉద్దేశమని అర్థమవుతోంది. ఈ సందర్భంగా పలు ఫేస్ బుక్
ప్రొఫైళ్లు తమ వెబ్ సైట్లని ప్రమోట్ చేసుకోవడానికి మహిళల పేర్లతో
ఆకర్షణీయమైన ఫొటోలతో ఇదే మాదిరిగా నా దృష్టికి వచ్చాయి. ఓ అనుమానం ఆధారంగా
ముందుకు వెళితే ఎంత తతంగం బయటపడిందో!




కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి